Home  »  TV News  »  శైలేంద్ర మాస్టర్ ప్లాన్ ని జగతి కనిపెట్టగలదా!

Updated : Jul 30, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -828 లో.. కాలేజీ మీటింగ్ లో తనకి జరిగిన అవమానం గుర్తుచేసుకొని శైలేంద్ర  కోపంగా ఉంటాడు. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని వచ్చి శైలేంద్రకి ఇస్తుండగా.. కాఫీనీ గోడకి కొడతాడు. అప్పుడే జగతి వచ్చి.. నీ ఫ్రస్ట్రేషన్ కి నువ్వు బాధ్యుడివి, దానిని ధరణిపై ఎందుకు చూపిస్తున్నావని జగతి కోప్పడుతుంది. ఆ తర్వాత నీకు సంబంధం లేని విషయం నువ్వు కలుగజేసుకోకని శైలేంద్ర అంటాడు. మీరు అన్యోన్యంగా ఉంటే మీ విషయంలో ఎవరు కలుగజేసుకోరు.. ఇలా ఉంటేనే కలుగుజేసుకోవాల్సి వస్తుందని జగతి అంటుంది. ఒకసారి ధరణి నీకు ఎదురు తిరిగి మాట్లాడితే నీ పరిస్థితి ఏంటని శైలేంద్రతో జగతి అంటుంది. అలా జగతి అనేసరికి శైలేంద్ర సైలెంట్ గా ఉండిపోతాడు. 

మరొకవైపు ఏంజిల్,  రిషి ఇద్దరు కార్ లో ఇంటికి వెళ్తు మాట్లాడుకుంటారు. నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని రిషితో ఏంజిల్ అంటుంది. చెప్పగలిగేలా ఉంటే చెప్తానని రిషి అంటాడు. నీకు వసుధారకి మధ్య ఏం ఉంది.. బద్ద శత్రుత్వమైనా ఉండాలి లేదా ప్రేమైనా ఉండాలని ఏంజిల్ అంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతీసారి నాకు ఇదే డౌట్ వస్తుందని ఏంజిల్ అంటుంది. రిషి మాత్రం ఏం చెప్పడు. అది అనవసరమైన విషయం వదిలేయమని, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది అది బయటపెట్టవద్దని రిషి అంటాడు. నా పర్సనల్ అన్ని నీతో షేర్ చేసుకున్నా కదా అని ఏంజిల్ అంటుంది. నేను షేర్ చేసుకోను అనవసరమైన దాని గురించి అలోచించకని ఏంజెల్ తో రిషి అంటాడు. రిషి వాళ్ళ మధ్య ఏం లేదని చెప్పడం లేదు అంటే కచ్చితంగా ఉంది అన్నట్లే కదా అని ఏంజిల్ తన మనసులో అనుకుంటుంది. మరొక వైపు జగతి, మహేంద్ర‌ ఇద్దరు మీటింగ్ లో.. శైలేంద్ర పదే పదే వాళ్ళ పేర్లు చెప్పండని అడుగుతున్నాడని మహేంద్రతో అంటుంది జగతి. వాళ్ళ మాటలు చాటుగా శైలేంద్ర వింటాడు.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శైలేంద్రకి కాలేజీ బాయ్ ఫోన్ చేసి.. కాలేజీలో వసుధార, రిషిల మధ్య గొడవ జరిగిన విషయం చెప్తాడు. కాలేజీలో వాళ్ళ మధ్య ఏదో ఉందనేలా డౌట్ క్రియేట్ చేసానని కాలేజీ బాయ్ చెప్తాడు. రాత్రి వసుధర దగ్గరికి రిషి వెళ్ళాడని చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషీల ఎంగేజ్మెంట్ ఫోటో ఒకటి కాలేజీ బాయ్ కి శైలేంద్ర పంపించి.. ఈ ఫోటోని కాలేజీలోని అన్ని గోడలపై అతికించు.. అందరి ముందు వాళ్ళ పరువు పోవాలని కాలేజీ బాయ్ కి శైలేంద్ర చెప్తాడు. అప్పుడే శైలేంద్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడని జగతి గమనించి తన దగ్గర ఉన్న వసుధార, రిషీల ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూసి.. ఆ ఆల్బమ్ అక్కడ ఎందుకు ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.